కాకతీయ, బయ్యారం : బయ్యారం మండల కేంద్రంలోని కోదండరామ దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనాచార్యులు ఆధ్వర్యంలో భక్తులు సోమవారం హనుమాన్ మాల స్వీకరించారు. ఈ సందర్బంగా అర్చకులు మాట్లాడుతూ హనుమాన్ దీక్షతో ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుందన్నారు. ఈ దీక్షను భక్తులు వీలును బట్టి మండలకాలం 41 రోజులు, అర్ధ మండల కాలం 21 రోజులు, పావు మండల కాలం 11 రోజులు మాల ధరిస్తున్నారన్నారు. ఈ దీక్షతో ఆధ్యాత్మిక భావన పెరగడంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని గురుస్వామి బానోత్ నరేష్, దారావత్ నాగు అన్నారు.


