ఘనంగా హనుమాన్ మకరతోరణ మహోత్సవం
దాత శోభన్ బాబును అభినందించిన గ్రామస్తులు
కాకతీయ, ఇనుగుర్తి: మండలంలోని అయ్యగారిపల్లి గ్రామ శ్రీ హనుమాన్ దేవాలయంలో మకరతోరణ స్థాపన మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. దాత భూక్య శోభన్ బాబు హనుమాన్ ఆలయ మకరతోరణం సమర్పించడంతో గ్రామ అభ్యున్నతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం జై భజరంగబలి జై హనుమాన్ విజయ హనుమాన్ నామస్మరణతో మారుమోగింది. మకరతోరణ దాత భూక్య శోభన్‌బాబు కుటుంబ సమేతంగా ఆలయంలో అన్ని కార్యక్రమాల ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ అభయాంజనేయస్వామికి మకర తోరణం సమర్పించి వేద పండితులు, ఆలయ పూజారి పణి స్వామి పండితులతో కైంకర్యాలు ఆలయంలో జరిపించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయనను గ్రామస్తులు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మాలోత్ మంజుల చిన్న మంగ్య నాయక్, మాలోత్ మంగ్య నాయక్, మాజీ ఎంపీటీసీ మామిడి జనార్ధన్, మామిడి అశోక్, భుక్య లక్పతి, కృష్ణమూర్తి, భుక్య రమేష్ నాయక్, మామిడి సోమయ్య తదితరులు పాల్గొన్నారు.


