కాకతీయ, లక్సెట్టిపేట : సమాజంలోని అవసరం ఉన్న నిరుపేదలను గుర్తించి వారికి సేవ చేయడం రోటరీ క్లబ్ ఉద్దేశ్యమని కరీంనగర్ రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ వెంకట కృష్ణ అన్నారు. రోటరీ క్లబ్ సీనియర్ బాశెట్టి చంద్ర గుప్తా ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా లక్సెట్టిపేటలో అరవింద్ కొత్తపల్లి, రోటరీ క్లబ్ కరీంనగర్ వారి సౌజన్యంతో తోపుడు బండ్లు పంపిణీ చేశారు. లక్సెట్టిపేట, దండేపల్లి కు చెందిన నిరుపేద మహిళా చిరు వ్యాపారస్థులకు తోపుడు బండ్లను అందజేశారు. కార్యక్రమంలో మంచిర్యాల రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాదాసు శ్రీనివాస్, వెంకటకృష్ణ, పల్లెర్ల మనోహర్, జిల్లా సత్తయ్య, నరేందుల భీమన్న దండేపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఎలుగూరి వేణు, పాలకుర్తి సుదర్శన్, సతీష్, గంధం శ్రీనివాస్, ఆర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో తోపుడు బండ్లు అందజేత
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


