epaper
Monday, March 2, 2026
epaper

చైర్మన్ పీఠం బీజేపీకి అప్పగించండి!

చైర్మన్ పీఠం బీజేపీకి అప్పగించండి!
కాంగ్రెస్‌కు ఓటేస్తే పన్నుల మోత ఖాయం
ఢిల్లీ నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా
నాయిని చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తా
జమ్మికుంట రూపురేఖలు మార్చే బాధ్యత నాది
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

కాకతీయ, జమ్మికుంట : రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు ఆ ప్రభుత్వం ఇచ్చింది గాడిద గుడ్డేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. పొరపాటున కాంగ్రెస్‌ను మళ్లీ గెలిపిస్తే ఇంటి పన్ను, నల్లా పన్ను, వ్యాపార పన్నుల పెంపు ఖాయమని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద నయాపైసా లేదని, బీజేపీకి మున్సిపాలిటీలను అప్పగిస్తే పన్నుల భారం లేకుండా ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో బండి సంజయ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సభకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి, ఎన్నికల ఇన్‌చార్జ్ ఎర్రం మహేశ్‌తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, జమ్మికుంట పట్టణం ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను ఎన్నిసార్లు గెలిపించినా పట్టణానికి రూపాయి కూడా రాలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ మీద కోపంతో కాంగ్రెస్‌కు ఓట్లు వేసినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని, మహిళలకు రూ.2500, తులం బంగారం, స్కూటీలు వంటి హామీలను కాంగ్రెస్ అమలు చేయలేకపోయిందన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జమ్మికుంట మున్సిపాలిటీకి ఏమిచ్చారని ప్రశ్నిస్తూ, చివరకు ఇచ్చింది “గాడిద గుడ్డే” అని ఎద్దేవా చేశారు.

కేంద్ర నిధులతోనే పట్టణాభివృద్ధి
జమ్మికుంట మున్సిపాలిటీలో బీజేపీ అధికారంలో లేకపోయినా కేంద్ర ప్రభుత్వం ద్వారా పెద్దఎత్తున నిధులు తీసుకొచ్చామని బండి సంజయ్ వివరించారు. 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.8 కోట్ల 23 లక్షలు, అమృత్ పథకం ద్వారా రూ.33 కోట్లు, స్వనిధి పథకం ద్వారా 4,587 మందికి రూ.8 కోట్ల 45 లక్షలు అందించామని తెలిపారు. ఖేలో ఇండియా పథకం ద్వారా సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ కోసం రూ.6 కోట్ల 50 లక్షలు మంజూరు చేయించామని, ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందించామని గుర్తుచేశారు. సీఎస్సార్, ఎంపీ ల్యాడ్స్ నిధులతో కోట్ల రూపాయలు తీసుకొచ్చి జమ్మికుంట ఆసుపత్రికి మెడికల్ ఎక్విప్‌మెంట్ సమకూర్చామని, అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డాక్టర్లు, సిబ్బందిని నియమించకుండా బాధ్యతను విస్మరించిందని ఆరోపించారు. నేడు మున్సిపాలిటీల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే సాధ్యమవుతోందని స్పష్టం చేశారు. బీజేపీకి మున్సిపల్ చైర్మన్ పీఠం అప్పగిస్తే జమ్మికుంట రూపురేఖలనే మార్చేస్తానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. నాయిని చెరువును రిజర్వాయర్‌గా అభివృద్ధి చేసి బోటింగ్ సదుపాయం కల్పిస్తానని, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. పట్టణ ప్రజల ఆస్తుల విలువ పెరిగేలా సమగ్ర అభివృద్ధి చేపడతానన్నారు.

జమ్మికుంటను సుందర పట్టణంగా మారుస్తా
జమ్మికుంటను వ్యాపార, కూరగాయల హబ్‌గా అభివృద్ధి చేస్తానని, అన్ని వార్డుల్లో అంతర్గత రోడ్లు నిర్మించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల్లో మురుగు నీటి సమస్య తలెత్తకుండా శాశ్వత ప్రణాళికతో అభివృద్ధి పనులు చేపడతానన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిస్తానని, పీఎం ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇళ్లు ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. బీజేపీ మోసపు హామీలు ఇవ్వదని, నిజాయితీతో పని చేస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మాటలు నమ్మి ప్రజలు ఇప్పటికే మోసపోయారని, మళ్లీ పొరపాటు చేస్తే పరిస్థితులు మరింత దారుణమవుతాయని హెచ్చరించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే పన్నుల భారమే తప్ప అభివృద్ధి ఉండదన్నారు. నిధులు తెచ్చి నిజమైన అభివృద్ధి చేయగల శక్తి బీజేపీకే ఉందని, ఈసారి జమ్మికుంట మున్సిపాలిటీని బీజేపీకి అప్పగించాలని ప్రజలను కోరారు. ఒక్క అవకాశం ఇస్తే పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని బండి సంజయ్ హామీ ఇచ్చారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img