- హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్
- రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్‌కు వినతి
- కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని మంత్రి ఆశాభావం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని కొన్ని రక్షణ భూములను కీలకమైన ప్రజా ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈమేరకు హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్‌ను … జీహెచ్ ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. ప్రజా వినియోగం కోసం కొన్ని రక్షణ భూములను ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. వినతిపత్రాన్ని పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మౌలిక సదుపాయాల కోసం..
రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, సికింద్రాబాద్ లో నివసిస్తున్న ప్రజలకు కీలకమైన మౌలిక సదుపాయాల అవసరాలను తీర్చడంలో, పౌర సౌకర్యాలను మెరుగుపరచడంలో రక్షణ శాఖ భూములు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కంటోన్మెంట్ నుండి తెలంగాణ ప్రభుత్వానికి యూజర్ ఛార్జీల భాగం కింద దాదాపు రూ.1,000 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ బకాయిలను సకాలంలో క్లియరెన్స్ చేయడం వలన రక్షణ శాఖ పరిధిలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో ప్రజా మౌలిక సదుపాయాలు కల్పించడం వారికి అవసరమైన పౌర సేవలు కొనసాగించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు లభిస్తుందని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి, ప్రజా సౌకర్యానికి అధిక ప్రాముఖ్యత కలిగిన కొనసాగుతున్న మౌలిక సదుపాయాలు, మొబిలిటీ ప్రాజెక్టులను అమలు చేయడానికి ఈ భూమార్పిడి కీలకమని మంత్రి లేఖలో పేర్కొన్నారు.


