ఘనంగా గుండ్ల సాహితీ జన్మదిన వేడుకలు
కాకతీయ, బోనకల్ : మార్పు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మానసిక వికలాంగుల శరణాలయం శాంతి నిలయం నందు వైరా వాస్తవ్యులు గుండ్ల గోపాలకృష్ణ, కళ్యాణి దంపతుల కుమార్తె గుండ్ల సాహితీ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బర్త్ డే కేక్ కట్ చేసి శాంతి నిలయంలోని అనాధ దివ్యాంగులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, గుండ్ల గోపాలకృష్ణ, గుండ్ల కళ్యాణి, గుండ్ల సాహితీ, గుండ్ల రోహన్ కార్తీక్, బొడ్డు లక్ష్మణ్, మనీషా, దీక్షిత శ్రీ, లోహన్స్ సాయి మణికంఠ, శాంతి నిలయం నిర్వాహకులు సిస్టర్ ఆల్ ఫీ, సిస్టర్ బిజిలీ, సిస్టర్స్ శ్యామల, ప్రేమ, రోజా, లియా తదితరులు పాల్గొన్నారు.


