కాకతీయ, హనుమకొండ : హన్మకొండ హంటర్ రోడ్డులోని గౌడ హాస్టల్ ఎదుట సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ఠ భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా గోపా కోఆర్డినేటర్ తీగల జీవన్ మాట్లాడుతూ.. భారత మాత ముద్దుబిడ్డ, తొలి తెలుగు చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర ప్రపంచ ప్రసిద్ధి గాంచిందని గుర్తుచేశారు. సామాజిక న్యాయం, స్వాభిమానం, సమానత్వం కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. తెలంగాణ తిరుగుబాటుకు స్ఫూర్తి నిచ్చిన వీరుడు పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు.
గౌడ జాతి గర్వకారకుడైన ఈ బహుజన యోధుడి ఆదర్శంగా తీసుకొని, రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా ఉంటూ ఆర్థిక, రాజకీయ రంగాలలో అభివృద్ధి సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోపా ఫౌండర్ అధ్యక్షులు పెరుమాండ్ల మధుసూదన్ గౌడ్, డాక్టర్ బైరి లక్ష్మీ నారాయణ గౌడ్, పులి శ్రీనివాస్ గౌడ్, చిర్ర రాజు గౌడ్, విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు అనంతుల రమేష్ గౌడ్, జనగాం శ్రీనివాస్ గౌడ్, బండారి జనార్ధన్ గౌడ్, కూనూర్ రంజిత్ గౌడ్, జూలూరి రంజిత్ గౌడ్, మార్క రవి గౌడ్, మాచర్ల శరత్ గౌడ్, గట్టు నరేష్ గౌడ్, గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, కార్పొరేటర్ పోశాల పద్మ స్వామి గౌడ్, ఏసీపీ కె. నాగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


