27 నుంచి గ్రీన్ ఇండియా ఛాలెంజ్
కాకతీయ, హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభించనున్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సంస్మరిస్తూ .. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు చెందిన 8వ ఎడిషన్‌ను ఆర్గనైజ్ చేస్తున్నారు. తెలంగాణను హరిత ప్రదేశంగా మార్చేందుకు విజినరీ నేత, తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారని, ఆయన నేతృత్వంలోనే తెలంగాణ హరితంగా మారిందని మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ అన్నారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రేరణతో లక్షలాది మంది రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటారు. మొక్కలు నాటడం, వాటి సంరక్షణ, కాపాడుకోవాలన్న ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను నిర్వహిస్తున్నారు.మాజీ రాజ్యసభ ఎంపీ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఉద్యమం జోరుగా సాగుతున్నది. అయితే మాజీ సీఎం కేసీఆర్ విజన్‌ను ముందుకు తీసుకెళ్లాలని, స్వచ్ఛమైన.. హరితమైన.. ఉత్తమ రేపటిని తీర్చిదిద్దేందుకు చేతులు కలపాలని సంతోష్‌కుమార్ తన ట్వీట్‌లో తెలిపారు. మార్పు కోసం మొక్కను నాటాలని, ఆ మార్పులో భాగస్వామ్యం కావాలని ఆయన తన ఎక్స్ అకౌంట్ ద్వారా పిలుపునిచ్చారు.


