ఇస్లామీయ మైదానంలో గ్రేట్ రాజ్ కమల్ సర్కస్
కాకతీయ, వరంగల్ సిటీ : వరంగల్ నగరంలోని ఇస్లామీయ కళాశాల మైదానంలో బుధవారం సాయంత్రం గ్రేట్ రాజ్ కమల్ సర్కస్ ను రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్ చే ప్రారంభం చేశారు, ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సరం,సంక్రాంతి పండుగ సెలవుల్లో పిల్లలు పెద్దలు అందరూ సర్కస్ చూసి ఆనందాన్ని ఆహ్లాదాన్ని మానసిక ఉల్లాసాన్ని పొందాలని, అలాగే అంతరించి పోతున్న సర్కస్ కళను సర్కస్ కళాకారులను రక్షించాలని కోరారు.ఆర్గనైజర్ తయ్యబ్ అస్లాం మాట్లాడుతూ అత్యంత ప్రమాదకరమైన సర్కస్ విన్యాసాలు జోకర్ విన్యాసాలతొ వరంగల్ జిల్లా ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రదర్శనలు 50 ఫీట్ల ఎత్తులో జూలా కొట్టడం, మోటార్ సైకిల్ల జుంపింగ్, క్యాండిల్ బ్యాలెన్స్, రింగ్ డాన్స్, అరేబియన్ ఫైర్ డాన్స్,మణిపూరి కళాకారులచే కత్తుల విన్యాసాలు, స్టిక్ జగిలింగ్, వెయిట్ లిఫ్టింగ్, నవారు పట్టి తో బ్యాలెన్స్ తదితర విన్యాసాలు ఉంటాయని చెప్పారు. ప్రతిరోజూ 3ఆటలు ప్రదర్శనలు 40 రోజుల పాటు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆర్గనైజర్ సంతోష్ షిండే, శ్రీకాంత్, మేనేజర్ ఫిరోజ్ అలీ మరియు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కొక్కుల సతీష్ ,మండల సురేష్ , స్థానిక మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతి సత్యనారాయణ, వహీద్ గుల్షన్ తదితరులు పాల్గొన్నారు.


