- లారీ డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలు
- స్థానికులకు తృటిలో తప్పిన పెను ప్రమాదం
కాకతీయ,మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో బస్టాండ్ వద్ద గురువారం తెల్లవారు జామున గ్రానైట్ లారీ బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ప్రకారం గ్రానైట్ రాళ్లు లారీ పై నుంచి రోడ్డుకు అడ్డంగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ కు తీవ్ర గాయాలు కావడంతో 108లో ఖమ్మం ఆస్పత్రికి వైద్యం కోసం తరలించినట్లు తెలిపారు. కాగా, మూడు భారీ గ్రానైటు రాళ్లు రోడ్డుపై ఉండటంతో అటు వైపు గా వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం కలిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


