కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా దామెర మండలం ఓగులాపూర్‌లోని డిస్నీల్యాండ్ హై స్కూల్‌లో జాతీయ గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ముఖ్య సలహాదారులు దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మీనివాసం పూలమాలలు సమర్పించారు. కరస్పాండెంట్ బాలుగు శోభారాణి, డైరెక్టర్లు దయ్యాల రాకేష్ భాను, దయ్యాల దినేష్ చందర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ.. తల్లిదండ్రుల తర్వాత గురువుకు ఉన్న ప్రత్యేక స్థానాన్ని విద్యార్థులకు వివరించారు. ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులను తమ పిల్లలుగా భావించి తీర్చిదిద్దాలని సూచించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెదులుకొని ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో 70 మంది ఉపాధ్యాయులను విద్యార్థులు సన్మానించారు. గురుపూజోత్సవం అనంతరం విద్యార్థులతో వినాయక నిమజ్జనం వైభవంగా నిర్వహించారు.


