ఘనంగా వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు
కాకతీయ, ఇనుగుర్తి : మండలంలోని వివిధ గ్రామాలలో రాజ్యసభ సభ్యులు ఎంపీ, గాయత్రి గ్రూప్ ఆఫ్ గ్రానైట్ అధినేత వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం మండలంలోని చిన్ననాగారం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి ఆలయ ఆవరణంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మద్దెల సుధాకర్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా దీకొండ వెంకన్న లతో నాయకులు, కార్యకర్తలు కలిసి భారీ కేక్ కట్ చేసినారు. ఇనుగుర్తి మండల కేంద్రంలో ఉప సర్పంచ్ సత్తుర్ యాదగిరి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, యువకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


