మార్కండేయ జయంతికి ఘనంగా ఏర్పాట్లు
21న ప్రత్యేక పూజలు, అభిషేకాలు
హన్మకొండలో భారీ శోభాయాత్ర
కాకతీయ, హన్మకొండ : శ్రీ భక్త మార్కండేయ జయంతి ఉత్సవాలను హన్మకొండ జిల్లాలో వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం, పద్మశాలి పరపతి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సన్నాహాలు సాగుతున్నాయి. ఈ నెల 21న కాజీపేట సోమిడిలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి ఆలయంలో ఉదయం 9 గంటలకు అభిషేకం, హోమం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు సోమిడి గుడి నుంచి భారీ శోభాయాత్ర ప్రారంభమై కాజీపేట చౌరస్తా, నిట్, నక్కలగుట్ట, హన్మకొండ చౌరస్తా మీదుగా వేయిస్తంభాల గుడి వద్ద ముగుస్తుంది. పద్మశాలి కుల బాంధవులు కుటుంబ సమేతంగా పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.


