జల్ జీవన్ మిషన్‌పై గ్రామ సభ
నల్లవెంకాయపల్లిలో అవగాహన కార్యక్రమం
కాకతీయ, శంకరపట్నం: జల్ జీవన్ మిషన్‌లో భాగంగా శంకరపట్నం మండలం నల్లవెంకాయపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మెడుదల నాగలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామస్తులకు మిషన్ భగీరథ పథకం గురించి అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన నీటి ట్యాంక్‌తో పాటు సంబంధిత ఆస్తులను అధికారికంగా సర్పంచ్‌కు అప్పగించారు. గ్రామ ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్, ఎస్ ఈ రాములు, ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్, ఎంపీవో కాసగొని ప్రభాకర్, ఉప సర్పంచ్ పొద్దుటూరి కొండాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, ఇతర అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


