గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఈ నెల 11 న జరిగే మొదటి విడత ఎన్నికల సందర్బంగా ఆయా మండలాల్లో చేస్తున్న ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ క్షేత్ర స్థాయిలో గురువారం పరిశీలించారు. రఘునాథపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. సర్వీస్ ఓటరు లకు పోస్ట్ ద్వారా చేస్తున్న పోస్టల్ బ్యాలట్ పత్రాల పంపిణి ప్రక్రియను కలెక్టర్ పరిశీలించి… తహసీల్దార్, ఎంపీడీవోకి పలు సూచనలు జారీ చేశారు. సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు.


