ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలి
పిఎసిఎస్ పర్సన్ ఇన్చార్జి మనోహర్ రావు
కాకతీయ, నెల్లికుదురు: దళారి వ్యవస్థ మూలంగా మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలలోనే వడ్లను విక్రయించి మద్దతు ధర పొందాలని పిఎసిఎస్ పర్సన్ ఇన్చార్జ్ మనోహర్రావు అన్నారు. నెల్లికుదురు పిఎసిఎస్ ఆధ్వర్యంలోని నైనాల, బ్రాహ్మణ కొత్తపెళ్లి, బొడ్లాడ లకు చెందిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం మనోహర్ రావు సీఈఓ బంధారపు యాదగిరి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో విక్రయించిన ధాన్యాన్ని తూర్పార పట్టి ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చినట్లయితే మాయిచ్చర్ 17% వచ్చిన వడ్లను వెంటనే కాటా పెట్టడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని వసతులు కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఈవో బంధారపు యాదగిరి గౌడ్, పిఎసిఎస్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.


