నారాయణలో గ్రాడ్యుయేషన్డే వేడుకలు
కాకతీయ, జనగామ : జనగామ పట్టణంలోని నారాయణ హై స్కూల్ ఈ ఛాంప్స్ విభాగం లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలను పాఠశాల ప్రిన్సిపాల్ ఫర్హాన ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వరంగల్ జోన్ డీజీఎం రిజ్వానా ఇమ్రాన్, ఈ కిడ్స్ ఆర్ఎండీ హెడ్ స్వాతి లక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాథమిక విద్య నుండి ఉన్నత పాఠశాల నిర్దిష్ట లక్ష్యం వైపు అడుగుపెట్టే సందర్భంగా పట్టభద్రుల వేడుకలను జరుపుకోవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థులకు క్యాప్ గౌన్ ధరింపజేసి పట్టభద్రులకు సర్టిఫికెట్స్, మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్లు సాయి కృష్ణ, శిరీష, శ్యామల, వైస్ ప్రిన్సిపాల్స్ శ్రీలేఖ, రేణుక, అకాడమిక్ డీన్ విక్రమ్, ఏవో బీఎన్ చారి అధ్యాపధ్యాపక బృందం పాల్గొన్నారు.


