విధుల నిర్లక్ష్యంపై జీపీఓ సస్పెన్షన్
అత్యవసర సమయంలో హాజరు కాకపోవడమే కారణం
కాకతీయ, పెద్దపల్లి : విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార ఆదేశాల అవహేళన ఆరోపణలతో ఓదెల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న గ్రామ పాలనాధికారి (జీపీఓ) సాకినరపు మొగిలిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో కార్యాలయానికి హాజరుకాకపోవడం, అధికారిక ఫోన్ కాల్స్ మరియు సందేశాలకు స్పందించకపోవడం వల్ల పరిపాలనా పనులకు ఆటంకం ఏర్పడిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తహసీల్దార్ ఓదెల పంపిన నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఏపీ సివిల్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం తక్షణమే సస్పెన్షన్ విధించడంతో పాటు సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్‌ను విడిచిపెట్టరాదని ఆదేశించారు. ఈ సమయంలో సబ్సిస్టెన్స్ అలవెన్స్ మాత్రమే చెల్లించనున్నట్లు స్పష్టం చేశారు.


