- అధికారులు, సిబ్బందికి జిష్ణు దేవ్ దసరా శుభాకాంక్షలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ రాజ్ భవన్‌లో మంగళవారం ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. దసరా పండుగ సందర్భంగా గవర్నర్ భద్రతా సిబ్బంది ఆయుధాలతోపాటు రాజ్ భవన్‌కు చెందిన అన్ని వాహనాలకు ప్రత్యేక పూజలు చేశారు. రాజ్ భవన్ ప్రాంగణంలోని ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీనియర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈసందర్భంగా అధికారులు, సిబ్బందికి గవర్నర్ జిష్ణుదేవ్ దసరా శుభాకాంక్షలు తెలిపారు.


