మహిళల సంక్షేమానికి ప్రభుత్వం ముందడుగు
వడ్డీ లేని రుణాలు,చీరల పంపిణీపై వెన్నం రజిత రెడ్డి హర్షం
కాకతీయ, కరీంనగర్ : మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ నిర్ణయాలు ప్రశంసనీయమని కరీంనగర్ కాంగ్రెస్ నగర అధ్యక్షురాలు వెన్నం రజిత రెడ్డి అన్నారు. మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడం, చీరల పంపిణీ కార్యక్రమాలు చేపట్టడం సమాజ ఆర్థిక నిర్మాణంలో పెద్ద మార్పుకు దారితీస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.ప్రతి మహిళ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని, కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు వడ్డీ రహిత రుణాలు ముఖ్య భూమిక వహిస్తాయని రజిత రెడ్డి పేర్కొన్నారు. పండుగ సందర్భంలో చీరల పంపిణీ చేయడం మహిళల హృదయాలను చేరే నిర్ణయమని, ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని ఆమె తెలిపింది.కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తోందని, భవిష్యత్‌లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని వెన్నం రజిత రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.


