దివ్యాంగులకు అండగా ప్రభుత్వం
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
సహాయ ఉపకరణాలు, సబ్సిడీల పంపిణీ
కాకతీయ, కొత్తగూడెం : దివ్యాంగుల జీవనోపాధి మెరుగుపడేందుకు ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా సహాయం అందిస్తున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెంలో నిర్వహించిన కార్యక్రమంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు, వివాహ ప్రోత్సాహక బహుమతులు, ఆర్థిక పునరావాస పథకం సబ్సిడీలు పంపిణీ చేశారు. జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీజీఓబి ఎంఎంఎస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులను జిల్లా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ ద్వారా అందించిన సహాయ ఉపకరణాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులకు రోజువారీ జీవితంలో సహాయపడే ఉపకరణాలు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. వాటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. అర్హులైన వారికి సి.ఎస్.ఆర్ ద్వారా రెట్రో ఫిటెడ్ మోటార్ వాహనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాన్స్ జెండర్ వ్యక్తులు కూడా స్వయం ఉపాధి పొందేందుకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో 25 రెట్రో ఫిటెడ్ మోటార్ వాహనాలు, 7 బ్యాటరీ ట్రైసైకిళ్లు, 7 బ్యాటరీ వీల్ చైర్లు, 8 మందికి ఆర్థిక పునరావాస సబ్సిడీ, 8 మందికి వివాహ ప్రోత్సాహక బహుమతి, 5 ట్రాన్స్ జెండర్ లకు సబ్సిడీ సహా మొత్తం 60 మందికి లబ్ధి చేకూరింది. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.



