కాకతీయ, నర్సంపేట: యూరియా అందక పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు 50వేల నష్టపరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే పెద్ది డిమాండ్ చేశారు. శుక్రవారం ఖానాపురం మండలంలోని మంగళవారిపేట ,గొల్లగూడెంతండా గ్రామాలలో యూరియా దొరకక నష్టపోయిన పంటలను నర్సంపేట పెద్ది సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. యూరియా పంపిణీలో జాప్యం చేస్తున్న ఖానాపురం మండల వ్యవసాయ అధికారినీ తక్షణమే సస్పెండ్ చేయాలని, యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్న వ్యవసాయ అధికారుల పైన కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అన్నారు.
గొల్లగూడెం తండాకు చెందిన రైతుకుటుంబం తేజవత్ శ్రీను స్రవంతిల ఆరెకరాల మొక్కజొన్న పంటకు యూరియా అందక , పశువులను మేపడంతో పంట నష్టపోయిన లావుడియా రాము లలిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పంటను పరిశీలించారు. యూరియా కొరత వలన గిరిజనులతోపాటు సన్న చిన్న కారి రైతుల యొక్క పత్తి, వరి, మొక్క జొన్న, పంటలు పూర్తిగా ఎర్రబడి పోతున్నాయి. పశువులను మేపే దుస్థితి వచ్చిందని, దీనికి ముమ్మాటికీ ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు నైతిక బాధ్యత వహించాలని అన్నారు.
పంటలకు పెట్టుబడి మొత్తం పూర్తయినదని, కోత దశ ఏరుకునే దశకు వచ్చింది, ఒక యూరియా బస్తా దొరికితే ప్రతి ఎకరానికి లక్షల రూపాయల విలువచేసే వివిధ పంటల దిగుబడి రైతుల చేతికి వచ్చేటువంటి చివరి సమయంలో యూరియా బస్తా కోసం పది రోజుల నుండి పదిసార్లు లైన్ లో నిలబడ్డ అస్వస్థకు గురైన భార్య ,పిల్లలతో, చిన్నపిల్లలతో, భుజాన ఎత్తుకొని లైను నిలబడ్డప్పటికీ కూడా యూరియా కరువైందని, ఇది ముమ్మాటికి విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం అనాచిత నిర్ణయాల వల్ల ఈ నష్టం జరిగింది కాబట్టి ప్రతి ఎకరాకు 3 పంటల సంబంధించి ఎకరాకు 50 వేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పంటలు కూడా ఎర్రబడి పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఎకరాకు 50 వేల రూపాయల నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని లేని యెడల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా నర్సంపేట నియోజకవర్గం లో తీవ్రమైన నిరసనలు ఉంటాయని ప్రభుత్వంన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల్లారా ఏ ముఖం పెట్టుకొని స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారని, ఎన్నికలకు వచ్చేటువంటి ధైర్యం కూడా కూడా లేదు మీకు తప్పించుకొని తిరుగుతున్నారు. గత ప్రభుత్వంలో కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు RFOR పట్టాలు ఇచ్చారని, సకాలంలో రైతుబంధు ఇవ్వడంతో పంట పెట్టుబడికి అంది దిగుబడి వచ్చిందిని, మద్దతు ధరకు కొనుగోలు చేశారని కానీ ప్రస్తుతం అన్ని కోల్పోయి రైతులు బజార్న పడే పరిస్థితి వచ్చిందన్నారు.
రైతులకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుందిని, తీవ్రమైన పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని, రైతులు మనోధైర్యం కోల్పోకుండా పోరాటాలకు సిద్ధం కావాలని, ప్రతి పంటకు ఎకరాకు 50 వేల రూపాయలు ఇచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులను నిలదీయాలని, తీవ్రమైన నిరసనలకు సిద్ధంగా ఉండాలని రైతులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకట నర్సయ్య, మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు క్లస్టర్ బాధ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.


