కాకతీయ, బయ్యారం: మండల కేంద్రంలోని (జడ్పీఎస్ఎస్ )జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల నందు సోషల్ టీచర్ నియమించకపోవడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు సోషల్ టీచర్ కావాలంటూ, గురువారం రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే 2025- 26 విద్య సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు కావస్తున్నా, నేటికీ ఆ పాఠశాలలో సోషల్ పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయుడు జిల్లా అధికారులు నియమించక పోవడంతో వారికి పాఠాలు చెప్పేవారు కరు వయ్యారని , ప్రభుత్వ పాఠశాలలో చదుకొమ్మంటారు..నాలుగు నెలలుగా వేచి చూసిన నేటికీ సోషల్ పాఠ్యాంశం బోధించే టీచర్లను నియమించక పోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు .
విద్యార్థినీలు పాఠశాల నుండి బయటకు వచ్చి స్థానిక ఎంఈఓ కార్యాలయానికి వెళ్లి అక్కడ తమ నిరసన వ్యక్తం చేశారు అనంతరం గాంధీ సెంటర్లో సోషల్ టీచర్ కావాలంటూ, వంద శాతం ఉత్తీర్ణత కావాలంటే ,సోషల్ టీచర్ నియమించండి అంటూ, నాలుగు నెలలైనా సోషల్ టీచర్ లేడంటూ.. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు సమాచారం అందడంతో సంఘటన ప్రాంతానికి చేరుకొని, విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని పై అధికారుల దృష్టికి తీసుక వెళ్తామని నచ్చ చెప్పి వారి నిరసనను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో 6వ,తరగతి నుండి 10వ తరగతి విద్యార్థినుల, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.


