ప్రభుత్వ హామీలు వెంటనే అమలు చేయాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
కాకతీయ, కొత్తగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని అన్నారు. యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, గృహ నిర్మాణ పథకం, రైతుభరోసా వంటి కీలక పథకాలు అమలు కావడం లేదని పేర్కొన్నారు. రైతులు ఆర్థిక ఇబ్బందులతో అప్పులపాలవుతున్నారని, ఆసరా పెన్షన్లు అర్హులకు అందడం లేదని తెలిపారు. భూభారతి సదస్సుల్లో దాఖలు చేసిన దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయని విమర్శించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాలు సరైన విధంగా లేవన్నారు. ధృవీకరణ పత్రాల జారీ ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జంపన సీతారామ రాజు, చెరుకు భాగ్యలక్ష్మి, పోడియం బాలరాజు, పున్నం బిక్షపతి, ఏనుగుల వెంకటరెడ్డి, బోగి కృష్ణ, రాపాక రమేష్, మెట్ట వెంకటేష్, జాటోత్ వెంకన్న, పల్లపు వెంకటేశ్వర్లు, జుబ్బూరి రమేష్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.


