epaper
Friday, January 23, 2026
epaper

టెక్స్టైల్ పార్క్ ప‌నుల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌లం

టెక్స్టైల్ పార్క్ ప‌నుల నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వం విఫ‌లం
వరద కాలువ ప‌నులు అర్ధాంత‌రంగా నిలిపివేత‌
రూ.160 కోట్ల పనులకు ఎందుకు బ్రేక్ వేశారు..
నిధుల్లేవన్న సాకుతో ప‌నులు ప‌క్క‌న పెట్టేశారు
అసమర్థ పాలనకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

కాకతీయ, గీసుగొండ : కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో వరద కాలువల బలోపేతానికి సంబంధించిన అత్యంత కీలక పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అర్థాంతరంగా నిలిపివేయడం దురదృష్టకరమని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు. పరిశ్రమల శాఖ జీఓ నెం.167 ప్రకారం రూ.160.92 కోట్లకు పరిపాలనా ఆమోదం ఇచ్చి, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించిన తర్వాత ఇప్పుడు వాటిని నిలిపివేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వర్షాకాలంలో వరద ముంపును నివారించేందుకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని, గత రెండు వర్షాకాలాల్లో టెక్స్టైల్ పార్క్ పూర్తిగా మునిగిపోవడంతో ఈ పనులకు మరింత ప్రాధాన్యత ఏర్పడిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని హెచ్చరించారు. వరదల భయంతో ఇప్పటికే పరిశ్రమల సిబ్బంది ఆందోళన చెందుతున్నారని, కొత్త పరిశ్రమలు రావాలంటే పెట్టుబడిదారులు భయపడుతున్న పరిస్థితి నెలకొందని ధర్మారెడ్డి తెలిపారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా వరద కాలువల పనులను నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందని మండిపడ్డారు. ఖాతా వివరాలు అందలేదన్న కారణం చూపి పనులు నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. గతంలో గొప్పలకు వెళ్లి టెండర్ల పేరుతో శంకుస్థాపనలు చేసి, ఇప్పుడు నిధులు లేవని చెప్పి పనులు ఆపేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. పరిశ్రమల భద్రత, వేలాది కార్మికుల ఉపాధి, ప్రాంత అభివృద్ధిని తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించడం సరికాదని, ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి వరద కాలువల బలోపేత పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరిశ్రమల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని హెచ్చరించారు.

యంగ్ వన్ కంపెనీని సందర్శించిన ధర్మారెడ్డి

కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లోని యంగ్ వన్ కంపెనీని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యంతో కలిసి పరిశ్రమలో కొనసాగుతున్న ఉత్పత్తి ప్రక్రియలు, కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలు, ఉపాధి అవకాశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్క్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన కుటుంబాలకు, స్థానికులకు ఉపాధి అవకాశాల్లో మొదటి ప్రాధాన్యత కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గీసుగొండ, సంగెం మండలాల మాజీ జడ్పీటీసీలు పోలీసు ధర్మారావు, గూడ సుదర్శన్ రెడ్డి, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు చల్లా వేణుగోపాల్ రెడ్డి, పూండ్రు జైపాల్ రెడ్డి, బోడకుంట్ల ప్రకాష్, ముంత రాజయ్య, గుర్రం రఘు, పులి సారంగపాణి, యూత్ నాయకులు సిరీషే శ్రీకాంత్, గోనె నాగరాజు, అజార్, గాలి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

పేదింటి ఆడబిడ్డలకు వరం ‘కల్యాణ లక్ష్మి’

పేదింటి ఆడబిడ్డలకు వరం ‘కల్యాణ లక్ష్మి’ సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేదు ప్రజా...

రీల్స్ చేసిన స్కూల్ అసిస్టెంట్ సస్పెండ్

రీల్స్ చేసిన స్కూల్ అసిస్టెంట్ సస్పెండ్ పాఠశాల సమయంలో చేయొద్ద‌ని డీఈవో చెప్పినా...

పండుగ మాటున బెల్లం, ప‌టిక అమ్మ‌కాలు

పండుగ మాటున బెల్లం, ప‌టిక అమ్మ‌కాలు గుడుంబా త‌యారీకి త‌ర‌లుతున్న బెల్లం జాతర ముసుగులో...

మేడారంలో కూలిన నేమ్ బోర్డు.. తప్పిన ప్రమాదం

మేడారంలో కూలిన నేమ్ బోర్డు.. తప్పిన ప్రమాదం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టిన...

మేడారం జాతరకు ఆర్‌టీసీ భారీ ఏర్పాట్లు

మేడారం జాతరకు ఆర్‌టీసీ భారీ ఏర్పాట్లు మేడారం జాత‌ర‌కు ప్ర‌త్యేకంగా 4,000 ప్రత్యేక...

కాక‌తీయ ఎఫెక్ట్‌..!

కాక‌తీయ ఎఫెక్ట్‌..! చెత్త డ్యూటీకి చీవాట్లు! బల్దియా డ్రైవర్లపై కమిషనర్ చాహత్ బాజ్ పాయ్...

పురపోరుకు సై

పురపోరుకు సై నర్సంపేటలో రాజకీయ వేడి బీఆర్ఎస్–కాంగ్రెస్ మధ్య తగ్గా పర్ కీల‌కంగా మారనున్న...

రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు

రోడ్డు భద్రత నియమాలపై అవగాహన సదస్సు కాకతీయ, రాయపర్తి : ప్రతి ఒక్కరూ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img