ఘనంగా గోపాల నవీన్ రాజు జన్మదిన వేడుకలు
కాకతీయ,గీసుగొండ: జిల్లా కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.వరంగల్ మహా నగర పాలక సంస్థ 16వ డివిజన్ తన స్వగ్రామమైన ధర్మారంలో అభిమానుల సమక్షంలో భారీ కేక్‌ను కట్ చేసి వేడుకలను నిర్వహించారు.అనంతరం పేద ప్రజలకు బ్లాంకెట్లను పంపిణి చేయడంతో పాటు పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లను అందజేశారు. అలాగే ధర్మారం, మొగిలిచర్ల, పోతారాజుపల్లి గ్రామాలలోని చర్చిలకు ఫ్రీజర్‌లను పంపిణి చేసి సామాజిక సేవా భావనను చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ కో-ఆప్షన్ సభ్యులు కొమ్ముల కిషోర్ కుమార్,మంద బాబురావు, పీసీసీ మెంబర్ మీసాల ప్రకాష్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రధాన కార్యదర్శి కృష్ణమాచారి, ప్రజాప్రతినిధులు కేడల జనార్దన్,పద్మ,మాడిశెట్టి రాజయ్య, గీసుగొండ సర్పంచ్ వీరగోని రాజుకుమార్, డోలె చిన్ని, సిలువేరు సాంబయ్య, కొట్టె ముట్టిలింగం, మడిశెట్టి రవి,నీరటి యాదగిరి, గోపాల శ్రీనివాస్,కొక్కొండ శ్రీకాంత్, రాజు సమ్మయ్య తదితరులు పాల్గొని గోపాల నవీన్ రాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


