epaper
Sunday, March 1, 2026
epaper

రైతులకు మళ్లీ తీపి కబురు

రైతులకు మళ్లీ తీపి కబురు
పీఎం కిసాన్ 22వ విడతకు కసరత్తు
రూ.2,000 కోసం రైతుల‌ ఎదురుచూపులు
ఫిబ్రవరిలో ఖాతాల్లో జమ అయ్యే అవకాశం
9 కోట్ల మందికి లబ్ధి.. అయితే ఈ-కేవైసీ తప్పనిసరి

కాక‌తీయ‌, స్పెష‌ల్ డెస్క్ : దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. సాగు ఖర్చులు పెరిగి పెట్టుబడి భారమవుతున్న తరుణంలో, అన్నదాతలకు అండగా నిలిచే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 22వ విడత నిధుల విడుదలపై కేంద్రం కసరత్తు ప్రారంభించింది. 2026 కొత్త ఏడాది ప్రారంభంతో రైతులందరి దృష్టి తమ ఖాతాల్లోకి వచ్చే రూ.2,000పైనే నిలిచింది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు కోసం రైతులు అప్పుల పాలవకుండా ఉండాలన్న లక్ష్యంతో 2019లో ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6,000 ఆర్థిక సాయం అందుతోంది. ఈ మొత్తాన్ని ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున మూడు విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తున్నారు. ఇప్పటివరకు 21 విడతలను ప్రభుత్వం విజయవంతంగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ విధానం వల్ల మధ్యవర్తుల జోక్యం లేకుండా డబ్బులు అందుతుండటంతో రైతుల్లో నమ్మకం పెరిగింది.

22వ విడత ఎప్పుడంటే..?!

ప్రస్తుతం 22వ విడత విడుదలపై అధికారిక ప్రకటన రాకపోయినా, గత అనుభవాలను బట్టి చూస్తే ఫిబ్రవరి 2026లో నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. బడ్జెట్ అనంతరం లేదా ఫిబ్రవరి రెండో వారంలో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కావచ్చని అంచనా. రబీ సాగు పనులు ఊపందుకునే సమయంలో ఈ నిధులు రైతులకు పెద్ద ఊరటగా మారనున్నాయి. చాలామంది రైతులకు నిధులు నిలిచిపోవడానికి ప్రధాన కారణం చిన్న సాంకేతిక లోపాలే. 22వ విడత సాయం ఎలాంటి ఆటంకం లేకుండా రావాలంటే రైతులు ఈ విషయాలు తప్పనిసరిగా పూర్తి చేయాలి.

ఈ-కేవైసీ పూర్తి చేయాలి – ఆధార్ ద్వారా పీఎం కిసాన్ పోర్టల్‌లో.
బ్యాంకు ఖాతా–ఆధార్ లింక్ అయి ఉండాలి.
డీబీటీ ఆప్షన్ ఎనేబుల్ అయి ఉండాలి.
భూమి రికార్డులు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అయి ఉండాలి.
ఈ మూడింటిలో ఏ ఒక్కటిలో తప్పు ఉన్నా నిధులు నిలిచిపోయే ప్రమాదం ఉంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img