కాకతీయ, బిజినెస్ డెస్క్: సెప్టెంబర్ 16వ తేదీ మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మార్పులు పెద్దగా లేకపోవడంతో స్థానికంగా కూడా ధరల్లో పెద్ద ఎత్తున హెచ్చుతగ్గులు కనిపించలేదు.
ఈరోజు 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర సుమారుగా రూ. 1,13,630 వద్ద నమోదైంది. విజయవాడలో రూ. 1,09,690, విశాఖలో 1,10,700గా నమోదు అయ్యింది. పెట్టుబడిదారులు, ఆభరణాల కొనుగోలుదారులు ఈ ధరలను గమనించి కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు వెండి ధరలు కూడా అంతే స్థాయిలో కొనసాగుతున్నాయి.
కిలో వెండి ధర సుమారుగా రూ. 1,29,320 వద్ద నమోదవ్వడం గమనార్హం. దీని వల్ల పండుగ సీజన్ లో వెండి ఆభరణాలు, వస్తువులు కొనుగోలు చేసే వారు కొంత స్థిరమైన మార్కెట్‌ను ఎదుర్కొంటున్నారు. బంగారం, వెండి ధరలు సాధారణంగా అంతర్జాతీయ పరిస్థితులు, రూపాయి విలువలో మార్పులు, డాలర్ బలహీనత వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి.
ఈ నేపథ్యంలో ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటుచేసుకోవడం సహజం. అయితే సెప్టెంబర్ 16న తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరగకపోవడం కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించింది. నిపుణులు దీర్ఘకాల పెట్టుబడుల కోసం బంగారం ఎప్పుడూ సురక్షిత సాధనమే అని చెబుతున్నారు.


