కాకతీయ, బిజినెస్ డెస్క్: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ సరికొత్త గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులపై దృష్టి పెడుతున్నారు. ఫలితంగా బంగారంపై డిమాండ్ గణనీయంగా పెరిగింది. మరోవైపు రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే క్షీణించడం కూడా పసిడి ధరలు ఎగబాకడానికి మరో కీలక కారణంగా కనిపిస్తోంది.
సెప్టెంబర్ 20న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,340కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 1,02,060గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,11,490గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,02,210గా ఉంది. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో కూడా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,11,340, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,060కి చేరింది.
ఇక వెండి ధరలు కూడా పెరుగుదల దిశలో కదులుతున్నాయి. నిన్నటితో పోల్చితే కిలో వెండి ధర సుమారు రూ. 100 మేర పెరిగి కొత్త స్థాయికి చేరుకుంది. పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరల్లో మరింత చలనం ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో రూ. 1, 11, 340, రూ. 1, 02, 060
విజయవాడలో రూ. 1, 11, 340, రూ. 1, 02, 060
ఢిల్లీలో రూ. 1, 11, 490, రూ. 1, 02, 210
ముంబైలో రూ. 1, 11, 340, రూ. 1, 02, 060


