కాకతీయ, బిజినెస్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో 24 క్యారెట్ బంగారం ధర ఏకంగా 1000 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,080కు చేరుకుంది. 22 క్యారెట్ బంగారం ధర రూ. 1,03,000 పలుకుతోంది. వరంగల్లో కూడా ఇదే రేట్లు కొనసాగుతున్నాయి.
విజయవాడలో 24 క్యారెట్ బంగారం ధర సుమారు రూ. 1, 14,194, 22 క్యారెట్ ధర రూ.1,03,261 వద్ద స్థిరంగా ఉంది. అలాగే విశాఖపట్నంలో కూడా అదే రేట్లు అమల్లో ఉన్నాయి. అంటే 24 క్యారెట్ బంగారం ధర రూ. 1,14,194, 22 క్యారెట్ బంగారం ధర రూ. 1,03,261గా ఉంది.
మొత్తం మీద తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలన్నింటిలోనూ నేటి బంగారం ధరలు ఒకే రేంజ్‌లో ఉండి, గత కొద్దిరోజులుగా పెరుగుతున్న ధోరణి కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, స్థానిక డిమాండ్ పెరగడం వల్ల ఈ ధరల పెరుగుదల కనిపిస్తోంది.


