కాకతీయ, బిజినెస్ డెస్క్: బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. పసిడి, వెండి రేట్లు గత కొన్ని వారాలుగా భారీగా పెరుగుతూనే ఉన్నాయి. అయితే, సెప్టెంబర్ 15, 2025 ఉదయం లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, నిన్నటితో పోలిస్తే ఈరోజు ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. పెట్టుబడిదారులు, వినియోగదారులు గమనించదగ్గ అంశం ఏమిటంటే.. ఈసారి తగ్గుదల తక్కువ మొత్తంలో ఉన్నప్పటికీ, పెరుగుదల ఒత్తిడిలో ఉన్న మార్కెట్‌లో ఇది ఊరటనిచ్చే పరిణామంగా మారింది.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర ఈరోజు రూ.1,11,160గా నమోదైంది. ఇదే సమయంలో 22 క్యారెట్ 10 గ్రాముల ధర రూ.1,01,890కి చేరింది. నిన్నటితో పోలిస్తే ఈ ధరలు సుమారు రూ.10 తగ్గాయి. వెండి ధరల్లో కూడా అదే ధోరణి కనిపించింది. ఢిల్లీలో కిలో వెండి రేటు రూ.100 తగ్గి రూ.1,32,900గా ఉంది.
నగరాల వారీగా బంగారం, వెండి ధరలు
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు కొన్ని స్వల్ప మార్పులు చూపించాయి. గ్లోబల్ మార్కెట్ పరిస్థితులు, స్థానిక పన్నులు, మేకింగ్ ఛార్జీల ఆధారంగా ఈ ధరల్లో తేడాలు వస్తుంటాయి.
ఢిల్లీ: 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రూ.1,11,290, 22 క్యారెట్ రూ.1,02,040. కిలో వెండి రూ.1,32,900.
హైదరాబాద్: 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.1,11,160, 22 క్యారెట్ రూ.1,01,890. కిలో వెండి రూ.1,42,900.
ముంబై: 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి రూ.1,11,160, 22 క్యారెట్ రూ.1,01,890. కిలో వెండి రూ.1,32,900.
చెన్నై: 24 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రూ.1,11,170, 22 క్యారెట్ రూ.1,02,190. కిలో వెండి రూ.1,42,900.
బెంగళూరు: 24 క్యారెట్ 10 గ్రాముల పసిడి రూ.1,11,160, 22 క్యారెట్ రూ.1,01,890. కిలో వెండి రూ.1,32,900.
కొలకతా: 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.1,11,160, 22 క్యారెట్ రూ.1,01,890. కిలో వెండి రూ.1,32,900.
గ్లోబల్ మార్కెట్‌లో వాణిజ్య ఉద్రిక్తతలు, డాలర్ బలహీనత, అంతర్జాతీయ ఆర్థిక సంకేతాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం తగ్గుదల స్వల్పంగా ఉన్నా, వచ్చే రోజుల్లో ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయాలు, అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు ఎలా ఉంటాయన్న దానిపై ధరలు ఆధారపడి ఉంటాయి.
భారత వినియోగదారుల దృష్టిలో బంగారం, వెండి ఎప్పటికీ సురక్షితమైన పెట్టుబడులుగా పరిగణించబడతాయి. అందువల్ల ధరల్లో చిన్న తగ్గుదల కూడా కొనుగోలు దారులకు ఉపశమనం కలిగించగలదు.


