కాకతీయ, బిజినెస్ డెస్క్: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. మంగళవారంతో పోల్చితే బుధవారం పది గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ. 1,02,000 ఉండగా 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 93,152 పలుకుతోంది. కిలో వెండి ధర రూ. 1,16,000 పలుకుతోంది. అంతర్జాతీయంగా మార్కెట్లో నెలకున్న అనిశ్చితి కారణంగా బంగారానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు టారిఫ్ యుద్ధాలు వంటివి ఈ అస్థిరతకు కారణం అయ్యాయని చెప్పవచ్చు. డాలర్ విలువ తగ్గడం వల్ల బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
శ్రావణమాసం ముగిసిన భాద్రపద మాసం ప్రారంభమవుతున్నా పెళ్లిళ్ల సీజన్ ఇంకా కొనసాగుతోంది. ఇది దేశీయంగా బంగారం డిమాండ్ భారీగా పెరిగేందుకు కూడా కారణం అయ్యిందని చెప్పవచ్చు. ఆర్థిక సంక్షోభం వస్తుందన్న భయంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. 10ఏళ్లలో బంగారం ధర దాదాపు రెట్టింపు లాభాలను అందించడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు.
బంగారంతోపాటు వెండి కూడా భారీగా పెరిగింది. అయితే కానీ ప్రస్తుతం నెమ్మదిగా తగ్గుతుంది. కిలో వెండి ధర రూ. 1,16,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. కొద్దికాలం క్రితం చూసిన గరిస్ట స్థాయిలతో పోల్చితే వెండి ధరలో రూ. 10,000 వరకు తగ్గింది. ఇటీవల కాలంలో వెండిలో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు.


