అన్నపూర్ణాదేవి అలంకారంలో భద్రకాళి మాత
కాకతీయ, వరంగల్ : భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా రెండో రోజు మంగళవారం అమ్మవారు అన్నపూర్ణేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మకర వాహన సేవ సాయంత్రం దేవజ దుర్గార్చన చంద్రప్రభ మహాసేవ నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు తెలిపారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భద్రకాళి శరణం మమః అనే భక్త నామస్మరణతోఆలయ ప్రాంగణమంతా మార్మోగుతోంది.!


