కాకతీయ, వరంగల్ : దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మొదటి రోజు భద్రకాళి అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేల సంఖ్యలో దేవస్థానానికి పోటెత్తారు. ఆలయ ప్రాంగణమంతా అమ్మవారి నామస్మరణతో మార్మోగింది.


