epaper
Monday, March 2, 2026
epaper

కుంభమేళా స్థాయిలో గోదావరి పుష్కరాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : గోదావరి పుష్కరాలను దేశవ్యాప్తంగా గుర్తింపు పొందేలా, దక్షిణ భారత కుంభమేళా స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 2027 జూలై 23 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల సన్నద్ధతపై ముఖ్యమంత్రి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కొండా సురేఖ, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గోదావరి తీరం వెంట ఉన్న ప్రధాన ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా బాసర నుంచి భద్రాచలం వరకు ధర్మపురి, కాళేశ్వరం వంటి ఆలయాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉండేందున, ముందుగా వీటిని అభివృద్ధి చేయాలని సూచించారు. ఆలయాల అభివృద్ధితో పాటు శాశ్వత పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.

శాశ్వత మౌలిక వసతులు..

మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవహించే గోదావరి నదికి రాష్ట్రంలో 560 కిలోమీటర్ల తీరం ఉండగా, దాదాపు 74 ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. ఒకేసారి రెండు లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలకు తరలివచ్చినా ఇబ్బంది లేకుండా రోడ్లు, వాహనాల పార్కింగ్, తాగునీరు, వసతి, ట్రాఫిక్ నియంత్రణ, ఘాట్ల నిర్మాణం వంటి మౌలిక వసతులు శాశ్వత ప్రాతిపదికన కల్పించాలని సీఎం ఆదేశించారు.

గతంలో మహా కుంభమేళా, పుష్కరాలు, ఆలయాల అభివృద్ధి వంటి విస్తృత అనుభవం కలిగిన కన్సల్టెన్సీలను నియమించుకోవాలని సీఎం సూచించారు. గోదావరి తీరం వెంట ఉన్న ప్రతి ఆలయాన్ని సందర్శించి విడివిడిగా ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేయాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యేక డిజైన్లు రూపకల్పన చేయాలని ఆదేశించారు.

కేంద్ర పథకాల వినియోగం

గోదావరి పుష్కరాల కోసం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలన్నింటినీ సమన్వయంతో ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్తో పాటు మరిన్ని పథకాల సహకారంతో పనులు చేపట్టాలని, భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు.

పుష్కరాల విజయవంతమైన నిర్వహణకు పర్యాటక, నీటి పారుదల, దేవాదాయ శాఖలు పూర్తి సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి, శాశ్వత ప్రాతిపదికన మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు

ఇక రవీంద్రభారతిలో ఆన్‌లైన్ బుకింగ్‌లు నూతన వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు

కుమ్మెర ఘటనపై డీజీపీని కలిసిన జాగృతి ప్రతినిధులు చిన్నారి మరణానికి కారణమైన వారిపై...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img