epaper
Thursday, March 5, 2026
epaper

ఆపరేషన్ ఆకర్ష్‌తో గులాబీ గూటికి గండి

ఆపరేషన్ ఆకర్ష్‌తో గులాబీ గూటికి గండి
కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేతల వలస
పాలేరులో మారుతున్న సమీకరణాలు!
ఏదులాపురమే లక్ష్యంగా హస్తం వ్యూహం
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు
మున్సిపల్ ఎన్నికల ముందే వేడెక్కిన రాజకీయాలు

కాకతీయ, కుసుమంచి : మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే ఖమ్మం జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పాలేరు నియోజకవర్గ పరిధిలోని ఏదులాపురం మున్సిపాలిటీపై పట్టు సాధించడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ‘ఆపరేషన్ ఆకర్ష్’తో బీఆర్ఎస్‌కు చెందిన కీలక నేతలు హస్తం గూటికి చేరుతుండటం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఆదివారం ఖమ్మంలో తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో జరిగిన చేరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రభావం ఉన్న నేతల చేరికతో కాంగ్రెస్ శిబిరంలో ఉత్సాహం పెరిగింది.

ఆపరేషన్ ఆకర్ష్.. లక్ష్యం ఏదులాపురమే!

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏదులాపురం మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా మంత్రి పొంగులేటి వ్యూహరచన చేస్తున్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యూహంలో భాగంగానే గ్రామ స్థాయిలో పట్టు ఉన్న నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగా గుర్రాలపాడు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కీలక నేత బుర్ర మహేష్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి పొంగులేటి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. బుర్ర మహేష్ చేరికతో ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ, ప్రతి పథకం లబ్ధి నేరుగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పనిచేసి అఖండ విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు బొల్లం వెంకన్న, కొర్ని సీతారాములు, తీగల శివ, దుంపల నాగరాజు, బొబ్బల రాంబాబు, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నేతలు వరుసగా కాంగ్రెస్‌లో చేరుతుండటంతో పాలేరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని, మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు కీలకంగా మారనున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖ‌మ్మంలో 6న జాబ్ మేళా

ఖ‌మ్మంలో 6న జాబ్ మేళా ప్రైవేట్ రంగంలో 322 ఉద్యోగాలు కాకతీయ, ఖమ్మం: ఉమ్మడి...

అంబులెన్స్ సేవలు త‌క్ష‌ణం అందేలా చూడాలి

అంబులెన్స్ సేవలు త‌క్ష‌ణం అందేలా చూడాలి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్...

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం

డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు కీలకం రహదారి భద్రతపై అవగాహన డ్రైవర్లకు ఉచిత కంటి...

పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రంగుల సంబరం

పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో రంగుల సంబరం ఎస్పీ రోహిత్ రాజుతో కలిసి హోలీ...

మైనర్‌కు వాహనం ఇచ్చిన వ్యక్తిపై కేసు

మైనర్‌కు వాహనం ఇచ్చిన వ్యక్తిపై కేసు కాకతీయ, చింతకాని : మండలంలో జరిగిన...

గిరిజన సంప్రదాయాలకు ప్రతిబింబం హోలీ

గిరిజన సంప్రదాయాలకు ప్రతిబింబం హోలీ బొక్కలతండాలో రంగుల పండుగ ఘనంగా కాకతీయ, కారేపల్లి :...

దాతల సాయం కోసం ఎదురుచూపు!

దాతల సాయం కోసం ఎదురుచూపు! పుట్టుకతో అంగవైకల్యం.. ఇప్పుడు షుగర్ వ్యాధి కాటు ఆపరేషన్‌కు...

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు!

బతికుండగానే ‘చంపేసి’ కోట్లు దోచేశారు! భద్రాచలం ఎల్ ఐసీ శాఖలో రూ. 1.52...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img