కాకతీయ, తెలంగాణ బ్యూరో: శనివారం భేటీ అయిన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీల్లో రిజర్వేషన్ పై గత ప్రభుత్వం విధించిన పరిమితిని ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని ఆధారంగానే ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కల్పించనుంది. అలాగే గవర్నర్ కోటాలో కోదండరామ్, అజారుద్దీన్ ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గతంలో సిఫార్సు చేసిన అమీర్ అలీఖాన్ స్థానంలో అజారుద్దీన్ కు చోటు కల్పించింది. అయితే ఇప్పుడు జూబ్లిహిల్స్ ఉపఎన్నికల అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠ నెలకొంది.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై జీవో.. మంత్రి వర్గం కీలక నిర్ణయం..!!
అప్డేట్ న్యూస్ కోసం కాకతీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి


