వైద్య విద్యార్థినికి అల్లం ఆర్థిక సహాయం
కాకతీయ,గీసుగొండ:కళాశాల ఫీజు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైద్య విద్యార్థినికి కాంగ్రెస్ నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి ఆర్థిక చేయూతను అందించారు. మండలంలోని మచ్చాపూర్ గ్రామానికి చెందిన దళిత వైద్య విద్యార్థినీ నమిండ్ల సుష్మా స్వరాజ్ ఎంబీబీఎస్ రెండవ సంవత్సరం చదువుతోంది. పేదరిక కారణంగా గత సంవత్సరం కాలేజీలో చేరలేని పరిస్థితి ఉందని స్థానిక కాంగ్రెస్ నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన ఆయన తన ట్రస్టు ద్వారా గత సంవత్సరం రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. రెండవ విడత కాలేజ్ ఫీజు నిమిత్తం ఎబిఆర్ ట్రస్టు నుండి మరో రూ.50 వేల సహాయాన్ని గురువారం జిల్లా కాంగ్రెస్ నాయకులు వీరగోని రాజ్ కుమార్ విద్యార్థినికి అందజేశారు. సుష్మా స్వరాజ్ ఎంబీబీఎస్ పూర్తి అయ్యే వరకు ప్రతి ఏడాది విద్యా సహాయాన్ని కొనసాగిస్తామని విద్యార్థినీ తల్లిదండ్రులు రవి, సునీతలకు రాజ్ కుమార్ భరోసా ఇచ్చారు. గ్రామానికి చెందిన ఆరేల్లి రాజు, కత్తి అమృతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. కూలీ పనులకు వెళ్లి గాయపడిన పాకాల సాంబయ్యను పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం మరో రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో గంగదేవిపల్లి మాజీ సర్పంచ్ గోనె మల్లా రెడ్డి, వేల్పుల మమత సురేష్, నమిండ్ల రవి, సునీత, బోడ హరి, రేవంత్ రాథోడ్, రాజేష్, భిక్షపతి, వార్డు సభ్యులు బొల్లి భాస్కర్, మాజీ వార్డు సభ్యులు కత్తి రాజేంద్ర ప్రసాద్, ఏరుకొండ పద్మ, మర్రి కుమార స్వామి, గండు రాజు, కోల సునీల్, కూనూర్ వీరభద్రం, బొల్లి ప్రభాకర్, బత్తినీ భాస్కర్, కార్తీక్, సాయి కృష్ణ, సునీల్, శ్రీధర్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.


