దక్షిణాఫ్రికా టెస్ట్‌కి గిల్ దూరం.. భారత్ కొత్త కెప్టెన్ ఎవరంటే?
మెగా నొప్పితో రెండో టెస్టు సిరీస్‌కు గిల్ దూరం
కొత్త లీడర్‌షిప్‌తో టీమిండియా
వైస్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు నాయకత్వ బాధ్యతలు
కాకతీయ, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టుకు ముందు టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా గువాహటి టెస్ట్‌కు దూరమయ్యాడు. గత కొంతకాలంగా మెడ నొప్పితో ఇబ్బంది పడుతున్న గిల్, పూర్తి స్థాయిలో రికవరీ కోసం ముంబైలోని స్పెషలిస్ట్‌ను సంప్రదించనున్నాడు. తొలి టెస్టులో కేవలం మూడు బంతులే ఆడిన తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిన గిల్ గాయం ఊహించిన దానికంటే సీరియస్‌గా మారింది.
గిల్ మ్యాచ్‌కు దూరమవడంతో వైస్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. కొన్నాళ్ల విరామం తర్వాత తిరిగి జట్టులోకి వచ్చిన పంత్ కు ఇది కీలక అవకాశం. అతడి అగ్రెసివ్ లీడర్‌షిప్ స్టైల్ టీమిండియాకు ఎలా పనిచేస్తుందో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే భారత్ జట్టు కూర్పులో ఇప్పటికే ఎడమచేతి వాటం బ్యాటర్లే అధికం. గిల్ స్థానంలో జట్టులోకి వచ్చే రేసులో ఉన్న సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్ కూడా ఎడమచేతివాళ్లే కావడంతో టీం మేనేజ్‌మెంట్ కొంత కన్‌ఫ్యూజన్‌లో పడింది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఇప్పటికే భారత్ 1-0తో వెనుకబడి ఉంది. తొలి టెస్టులో బ్యాటింగ్ వైఫల్యం, కీలక సమయాల్లో బౌలర్ల అసమర్ధత ఈ రెండూ భారత్‌ను దెబ్బతీశాయి. అటువంటి సమయంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గైర్హాజరీ జట్టుకు మరో పెద్ద లోటుగా మారింది. గిల్ కేవలం నాయకుడే కాదు, కొత్త ఓపెనింగ్ కాంబినేషన్‌కు ప్రధాన బలం. అతడి లేని లోటు ఓపెనింగ్ స్టాండ్‌నే కాదు, మధ్యమట్ట లైనప్ మీద కూడా ఒత్తిడిని పెంచుతుంది.
అయినా సిరీస్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఓపెనింగ్‌లో సాయి సుదర్శన్‌కు అవకాశం ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సమాచారం. కాగా, శనివారం నుంచి గువాహటి వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ భారత గమనాన్ని నిర్ణయించబోతోంది. భారత్ ఈ మ్యాచ్ గెలవకపోతే సిరీస్ చేజారే ప్రమాదం ఉన్నందున, ఇది డూ అర్ డై మ్యాచ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక కొత్త కెప్టన్ రిషభ్ పంత్‌కి అగ్రెసివ్ మైండ్‌సెట్, శార్ప్ రీచింగ్ సామర్థ్యం ఉన్నా, టెస్ట్ కెప్టెన్సీ అనేది విభిన్నమైన బాధ్యత. మ్యాచ్‌ను చదవడం, బౌలర్ల రిథమ్‌ను అర్థం చేసుకోవడం, ఫీల్డింగ్ సెట్టింగ్స్‌ను స్థిరంగా నిర్వహించడం.. ఇవి పంత్‌కు కొత్త పరీక్షలు. మరి ఈ పరీక్షల్లో పంత్ ఏమేరకు పాస్ అవుతాడో చూడాలి.


