epaper
Tuesday, December 2, 2025
epaper

రియల్‌ ఎస్టేట్ పేరిట ఘరానా మోసం.. రూ. 330 కోట్లు స్వాహా!

రియల్‌ ఎస్టేట్ పేరిట ఘరానా మోసం.. రూ. 330 కోట్లు స్వాహా!
వెల్త్ క్యాపిటల్ కంపెనీ భారీ మోసం బట్టబయలు
వడ్డీ ఆశ చూపించి 300 మందికి కుచ్చు టోపీ
330 కోట్ల స్కామ్‌పై నల్లగొండలో ఆందోళనలు

కాక‌తీయ‌, క్రైమ్ : ఇంట్లోంచి బయటికి అడుగుపెట్టకుండానే భూమి కొని, ప్రతి నెలా వడ్డీ తెచ్చుకునే ‘సూపర్‌ ప్రాఫిట్‌’ ప్లాన్‌! ఎవరైనా ఈ ఆఫర్ వినిపిస్తే వెంటనే అనుమానం రావాలి. కానీ అధిక లాభాలు, రెట్టింపు రిటర్న్స్ చూపిస్తే ఎంత తెలివైన వాళ్లయినా ఒకసారి అయినా ఆలోచిస్తారు. అదే బలహీనతను క్యాష్ చేసుకున్న ఘరానా మోసం ఇప్పుడు నల్లగొండ–సంగారెడ్డి జిల్లాల్లో పెద్ద వివాదంగా మారింది.

రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో 12 వెల్త్ క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్థాపించారు. ‘రియల్ ఎస్టేట్ వెంచర్’ అని పేరు పెట్టి, ఒక్కసారి రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే ఒక గుంట భూమి ఇస్తామన్నారు. అంతేకాదు 25 నెలల పాటు నెలకు రూ.16 వేల వడ్డీ, గడువు ముగిసే సరికి రూ.8 లక్షలు క్యాష్ హామీ ఇచ్చారు. మొదట్లో కొందరికి వడ్డీ చెల్లించడం, అందమైన మాటలు చెప్పడం… మొత్తం స్కీమ్‌ను నిజంగానే నమ్మేలా చేసింది. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, అధికారులు, సాధారణ కుటుంబాలు.. ఎవరూ ఈ వల నుంచి తప్పించుకోలేకపోయారు.

అయితే కథ ఇక్కడే తిరిగేసింది. రిజిస్ట్రేషన్ చేసినట్లు ఇచ్చిన పత్రాలు నకిలీ బాండ్ పేపర్లు మాత్రమేనని బాధితులు గ్రహించేనాటికి, వారి పెట్టుబడులు మొత్తం స్వాహా అయ్యాయి. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం రాంసాగర్‌పల్లిలో ఉన్న భూములను బై నంబర్లు వేసి రిజిస్ట్రేషన్ చేసినట్లు చెప్పినా… అక్కడ భూమి ఏదీ చూపించలేదు. నెల నెలా వడ్డీ కూడా కొందరికే చెల్లించడంతో మోసం బయటపడింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం రూ.330 కోట్ల వరకు సేకరించారన్న బాధితుల ఆరోపణలు పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో చూపిస్తున్నాయి.

ఈ సంస్థ ఏజెంట్లు నల్లగొండ జిల్లాలో 300 మందికి పైగా పెట్టుబడులు పొందినట్టు సమాచారం. ఇప్పుడు వారందరూ ఒక్కొక్కరుగా మోసపోయామని గ్రహించి ఆందోళనకు దిగుతున్నారు. సంస్థ లీగల్ అడ్వైజర్ రాపోలు ప్రకాశ్ ఇంటి వద్ద బాధితులు నిరసనకు దిగ‌డంతో, పోలీసుల జోక్యం చేసుకుని ప్రకాశ్‌ను టూటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనితో బాధితులు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌కు ఫిర్యాదు చేసి న్యాయం కోరుతున్నారు. కాగా, రియల్ ఎస్టేట్ పేరిట మోసాలు కొత్తవి కావు. కానీ ఇంత పెద్ద ఎత్తున, ఇంత స్పష్టంగా ప్రణాళికబద్ధంగా చేసిన స్కామ్ మాత్రం అరుదే. అధిక లాభం ఆశలో అమాయకుల కలలను దోచుకున్న ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఆ శవం ఎవరిది..? ఎవ‌రు హ‌త్య చేశారు

ఆ శవం ఎవరిది..? ఎవ‌రు హ‌త్య చేశారు మిస్ట‌రీగా శంభునిప‌ల్లి గోనె సంచిలో...

*డీజీపీ ఎదుట ఆజాద్ లొంగుబాటు*

*డీజీపీ ఎదుట ఆజాద్ లొంగుబాటు* *ఆయ‌న‌తో పాటు మ‌రో 36మంది మావోయిస్టు నేత‌లు* *మ‌రి...

బావ ఇంటికి బావమరిది కన్నం.. కుటుంబాన్ని నమ్మించి నేరం

బావ ఇంటికి బావమరిది కన్నం కుటుంబాన్ని నమ్మించి నేరం ఆరు నెలల క్రితం జరిగిన...

ఖమ్మం నరగంలో దారుణ హత్య

ఖమ్మం నరగంలో దారుణ హత్య భార్య ను గొంతు కోసి హత్య చేసిన...

మారేడుమిల్లిలో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌..! ఏడుగురు మృతి

మారేడుమిల్లిలో మ‌రో ఎన్‌కౌంట‌ర్‌..! ఏడుగురు మృతి కాక‌తీయ‌, ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లోని...

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐ పారిపోతున్న ఎస్సైను వ్యవసాయ పొలాల వద్ద...

హిడ్మా హ‌తం..!

హిడ్మా హ‌తం..! ఒడిషా బార్డ‌ర్‌లో ఎన్ కౌంట‌ర్‌ హిడ్మాతో పాటు మ‌రోన‌లుగురు సైతం మృతుల్లో హిడ్మా...

హిడ్మా హ‌తం..!? ఒడిషా బార్డ‌ర్‌లో ఎన్ కౌంట‌ర్‌

హిడ్మా హ‌తం..!? ఒడిషా బార్డ‌ర్‌లో ఎన్ కౌంట‌ర్‌ హిడ్మాతో పాటు మ‌రో ఆరుగురు సైతం.. మృతుల్లో...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img