epaper
Saturday, November 15, 2025
epaper

గౌడ కమ్యూనిటీ ఐక్యత.. అభివృద్ధి దిశగా జీజీఈఏ కొత్త తీర్మానాలు.!!

కాకతీయ, భూపాలపల్లి : భూపాలపల్లిలోని సంఘమిత్ర డిగ్రీ & పీజీ కళాశాలలో గౌడ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (జీజీఈఏ) భూపాలపల్లి యూనిట్ ఆధ్వర్యంలో తొలి సన్నాహక సమావేశం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న గౌడ కమ్యూనిటీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై సంఘానికి మద్దతు తెలిపారు. సమావేశంలో గౌడ కమ్యూనిటీ ఐక్యత, అభివృద్ధి, యువత ప్రోత్సాహం, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ వంటి అంశాలపై పలు తీర్మానాలు ఆమోదించబడ్డాయి.

ముఖ్యంగా.. చదువులో, పోటీ పరీక్షల్లో, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రతి సంవత్సరం సన్మానించడం. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిని ప్రత్యేక కార్యక్రమాలలో గౌరవించడం. జాతిపిత సర్దార్ సర్వాయి పాపన్న జయంతి, వర్థంతి వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం. గౌడ ప్రభుత్వ ఉద్యోగుల సహకార పరపతి సంఘాన్ని ఏర్పాటు చేసి, అధికారిక రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం. 2026 సంవత్సరానికి ప్రత్యేక క్యాలెండర్, డైరీలను జీజీఈఏ తరపున ప్రచురించడం. కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యలపై సంఘం తరపున అధికారికంగా స్పందించడం. సంప్రదాయ బంధాన్ని బలోపేతం చేసే కార్తీక వన బోజనాలను నిర్వహించడం.

అడ్-హాక్ కమిటీ సభ్యులు..

ఈ సందర్భంగా తాత్కాలిక అడ్-హాక్ కమిటీని ప్రకటించారు. కన్వీనర్ బత్తిని వెంకటేశ్వర్లు గౌడ్, కో-కన్వీనర్ చిర్ర రఘు గౌడ్, సభ్యులు.. దాసరి చంద్రమౌళి గౌడ్, వేముల సదానందం గౌడ్, తోట సురేష్ గౌడ్, కాసగాని తిరుపతి గౌడ్, మూల తిరుపతి గౌడ్, ఉమ్మగాని క్రాంతి గౌడ్, గండి రాజ్ కుమార్ గౌడ్, ముక్కెర ధనుంజయ్ గౌడ్, పెసరు నాగరాజు గౌడ్, గుర్రం రాజు గౌడ్, ముక్కెర హేమంత్ గౌడ్, బాలవేని రాంబాబు గౌడ్, అంబటి దేవెందర్ గౌడ్, గట్టు కపిల్ గౌడ్. ఈ కమిటీ తాత్కాలికంగా బాధ్యతలు నిర్వహిస్తూ, రాబోయే ప్రధాన సమావేశంలో శాశ్వత కమిటీని ఎన్నుకోనుంది.

ఈ సందర్భంగా కన్వీనర్ బత్తిని వెంకటేశ్వర్లు గౌడ్ మాట్లాడుతూ.. మన గౌడ కమ్యూనిటీకి ఉద్యోగాల్లో, విద్యలో, సేవా కార్యక్రమాల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి, భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలిచేలా జీజీఈఏ పనిచేస్తుంది. సమాజ అభివృద్ధే మా ప్రధాన లక్ష్యం అన్నారు. భూపాలపల్లి పరిసర ప్రాంతాల నుండి అనేక మంది గౌడ ప్రభుత్వ ఉద్యోగులు హాజరై సంఘం ప్రారంభానికి మద్దతు తెలిపారు.

సమాజ అభివృద్ధి కోసం విద్య, ఉపాధి, సేవా కార్యక్రమాల్లో కొత్త ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయించారు. యువతకు ప్రేరణ కలిగించేలా సన్మాన కార్యక్రమాలు, సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేసేలా పాపన్న జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. సమావేశం విజయవంతంగా నిర్వహించ బడటం గౌడ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్యతకు నిదర్శనమని, భవిష్యత్తులో సంఘం మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడుతుందని పాల్గొన్న ఉద్యోగులు అభిప్రాయపడ్డారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌

కాంగ్రెస్‌లో రేవంత్ జోష్‌ జూబ్లీహిల్స్ పీఠంపై హ‌స్తం పార్టీ జెండా ఉప ఎన్నిక గెలుపుతో...

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు

రామప్ప ఆల‌యానికి నెదర్లాండ్ దంపతులు కాకతీయ, ములుగు ప్రతినిధి: యునెస్కో వరల్డ్ హెరిటేజ్...

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి కాకతీయ, దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి...

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం కాకతీయ,నర్సింహులపేట: మండలంలోని ఎంపీయుపిఎస్ పడమటిగూడెం,మండల కేంద్రంలోని జిల్లాపరిషత్...

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం

అయ్యప్ప స్వామి కుటీరం గృహప్రవేశం కాకతీయ,నర్సింహులపేట: మండల కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం...

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి…

చెట్లను తొలగించిన వారిని అరెస్టు చేయాలి... కాకతీయ, రాయపర్తి /వర్ధన్నపేట : వర్ధన్నపేట...

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది

డిజిటల్ బోధనతో అవగాహన పెంపొందుతుంది కాకతీయ, నెల్లికుదురు : డిజిటల్ బోధనతో విద్యార్థుల్లో...

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

మండలంలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కాకతీయ, పెద్దవంగర : మండల కేంద్రంలోని పలు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img