- బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి
కాకతీయ,ఆత్మకూరు : తుఫాను సమాచారంతో రైతులను అప్రమత్తం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని బీజేపీ మండల అధ్యక్షులు ఉప్పుగాళ్ల శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు మండలంలోని పలుగ్రామాల్లో పర్యటించి పంట నష్టంపై మాట్లాడారు. చేతికొచ్చిన పంటలను మొంథా తుఫానుతో నేల పాలు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బయ్యా పైడి కళ్యాణ్, మండల మాజీ అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం, పిసాల సాంబయ్య, కుక్కల కుమారస్వామి, భూత్ అధ్యక్షులు బూర దశరథం, బయ్యా శ్రీనివాస్, దూధాటి తిరుపతి, మాసంపెల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు.


