కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని బుధవారం జర్మన్ పర్యాటకుడు క్రిష్టియన్ స్లావిక్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆలయ చరిత్ర, శిల్పకళా వైభవం, రామప్ప దేవాలయ ప్రాముఖ్యత గురించి స్టేట్ టూరిస్ట్ గైడ్ సాయినాథ్ జొన్నలగడ్డ, టూరిజం గైడ్ గోరంట్ల విజయ్ కుమార్ వివరించారు. అనంతరం క్రిష్టియన్ స్లావిక్ రామప్ప చెరువును సందర్శించారు


