గీత కార్మికుడికి గాయాలు
కాకతీయ, దుగ్గొండి: మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో మంగళవారం తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడికి గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన గడ్డమీది సాంబయ్య వృత్తినిర్వహణలో భాగంగా తాడిచెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారి కింద పడగా కుడి కాలు విరిగి తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే అతనిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కాగా నిరుపేద కుటుంబానికి చెందిన సాంబయ్యను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు, గౌడ కులస్థులు కోరుతున్నారు.


