శ్రీ సరస్వతీ శిశు మందిర్ హై స్కూల్‌లో గీతా జయంతి వేడుకలు
కాకతీయ, కరీంనగర్: శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్‌లో గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు భగవద్గీత 12వ అధ్యాయం,భక్తి యోగం అష్టాదశ శ్లోకీ పఠనం చేశారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బల్మూరి కరుణాకర్ రావు, నర్సింగరావు, శ్రీనివాస్ రావు, సి ఏ మహేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ భగవానుడి మహిమను వివరిస్తూ “ఇంటింటికి భగవద్గీత” కార్యక్రమంలో భాగంగా డాక్టర్ నాళ్ల సత్య విద్యసాగర్ భగవద్గీత పుస్తకాలను విద్యార్థులకు, ఆచార్యులకు సిబ్బందికి అందజేశారు.ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఇంజనీర్ కోల అన్నారెడ్డి, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, ఎలగందుల సత్యనారాయణ, మేచినేని దేవేందర్ రావు, గట్టు శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్, గోలి పూర్ణచందర్, కొత్తూరి ముకుంద్, డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్, గట్టు రాంప్రసాద్, నడిపెల్లి దీన్ దయాల్ రావు, అప్పిడి వకులా దేవి తదితరులు అభినందనలు తెలిపారు అని పాఠశాల ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి పేర్కొన్నారు.


