- ఆభరణాలు, నగదు స్వాధీనం
- పరకాల ఏసీపీ సతీష్ బాబు
కాకతీయ, ఆత్మకూరు : చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశామని పరకాల ఏసీపీ సతీష్ బాబు తెలిపారు. శుక్రవారం ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామంలో వాహన తనిఖీలు చేస్తుంటే అనుమానాస్పదంగా ఉన్న మైనర్ నిందితులతో సహా ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ హనుమకొండకు చెందిన పాశం ప్రణీత్, సరిగొమ్ముల లియో స్పర్జన్ రాజ్, ఇద్దరు మైనర్లు మద్యానికి అలవాటు పడి జూన్ 4న తన్నిముట్టి సాయితో కలిసి ఆత్మకూర్ మండలం గూడెప్పాడ్ లోని రామాలయంలో వేయి రూపాయల నగదు, రాముల వారి వెండి జంజరం, రెండు బంగారు గంటె పుస్తెలు వాటి మొత్తం విలువ రూ.28వేలు దొంగతనం చేశారని తెలిపారు. అలాగే దుగ్గొండి మండలం గిర్నిబావి వద్ద గల ఒక వైన్ షాపులో వెంటిలేటర్ కు వున్న గ్రిల్స్ ను పగులగొట్టి కౌంటర్ లో రూ.12వేల నగదు, మద్యం బాటిల్లు దొంగతనం చేశారని తెలిపారు. నిందితుల నుండి దేవాలయంలో తస్కరించిన ఆభరణాలు, ద్విచక్ర వాహనం, రూ.12నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ అరెస్టులో ఆత్మకూరు సీఐ సంతోష్, ఎస్సై తిరుపతి, సతీష్, కానిస్టేబుల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


