epaper
Monday, March 2, 2026
epaper

గాంధీ మార్గమే శాశ్వత బలం

గాంధీ మార్గమే శాశ్వత బలం
మహాత్ముడి ఆశయాలతో కాంగ్రెస్ ముందుకు
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్
గాంధీ వర్ధంతి సందర్భంగా హనుమకొండ డీసీసీ భవన్‌లో ఘన నివాళి
డీసీసీ భవన్‌లో కాంగ్రెస్ శ్రేణుల శ్రద్ధాంజలి
సర్వోదయ చరక సంఘటన్‌కు మీనాక్షి శ్రీకారం
స్వదేశీ–స్వావలంబనపై నేతలకు పిలుపు

కాక‌తీయ‌, హనుమకొండ : గాంధీజీ చూపిన స్వదేశీ మార్గమే దేశ ఆర్థిక బలోపేతానికి పునాది అని అన్నారు. స్వావలంబనతోనే సమాజం నిలదొక్కుకుంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్చార్జి మీనాక్షి న‌ట‌రాజ‌న్‌ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతిని పురస్కరించుకుని శుక్ర‌వారం హనుమకొండ డీసీసీ భవన్‌కు వ‌చ్చిన మీనాక్షి న‌ట‌రాజ‌న్ మ‌హాత్ముడి చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు హ‌న్మ‌కొండ డీసీసీ అధ్య‌క్షుడు ఇనుగాల వెంకంట్రాంరెడ్డి, వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేంద‌ర్ రెడ్డితో పాటు ఇత‌ర ముఖ్య నేత‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మీనాక్షి నటరాజన్ పాల్గొని గాంధీ ఆశయాల ప్రాముఖ్యతను వివరించారు. గాంధీ గారి సత్యం, అహింస, స్వదేశీ, సర్వోదయం వంటి సిద్ధాంతాలే నేటి సమాజానికి శాశ్వత దిశానిర్దేశకమని మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. గాంధీ మార్గమే దేశానికి నిజమైన బలమని, ఆ ఆశయాలతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. గాంధీజీ సిద్ధాంతాలు కేవలం పుస్తకాల్లో కాకుండా ఆచరణలోకి వచ్చినప్పుడే నిజమైన నివాళి అవుతాయని అన్నారు.

సర్వోదయ చరక సంఘటన్‌కు శ్రీకారం

గాంధీ ఆశయాలకు ప్రతీకగా డీసీసీ భవన్‌లో సర్వోదయ చరక సంఘటన్ కార్యక్రమాన్ని మీనాక్షి నటరాజన్ ప్రారంభించారు. చరకం ద్వారా స్వావలంబన, స్వదేశీ భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. దూది నుంచి నూలు వడకడం మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని, మానసిక బలాన్ని పెంపొందిస్తుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ ఆశయాలను విధానంగా తీసుకుని ప్రజాసేవలో ముందుకు సాగుతుందని హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అయ్యూబ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం, రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, టీపీసీసీ ఉపాధ్యక్షులు దుద్దిళ్ల శ్రీనుబాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఈ.వి. శ్రీనివాస్ రావు, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ రాజేశ్వర్ రావు, జాతీయ కోఆర్డినేటర్ పులి అనిల్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img