తహసిల్దార్, ఎస్ఐలను కలిసిన గణపురం సర్పంచ్
కాకతీయ, గణపురం : నూతనంగా బాధ్యతలు చేపట్టిన గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక–శ్రీనివాస్ దంపతులు బుధవారం గణపురం తహసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామిని, గణపురం ఎస్ఐ రేఖ అశోక్, రెండవ ఎస్ఐ గైకవాడ అమూల్యలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అధికారులకు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామాభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని కోరుతూ, అధికారులతో కలిసికట్టుగా పనిచేసి గణపురం పంచాయతీని ఉత్తమ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దేలా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.


