మండల వ్యవసాయ అధికారిగా గాజుల శ్యామ్
కాకతీయ, దుగ్గొండి: మండల వ్యవసాయ అధికారిగా గాజుల శ్యామ్ గురువారం వ్యవసాయ అధికారి కార్యాలయంలో భాద్యతలను స్వీకరించారు. ఇంతక ముందు ఇక్కడ పని చేసిన వ్యవసాయ అధికారి భానోత్ మాధవి వరంగల్ భూసార పరీక్ష కేంద్రం డిప్యూటేషన్ పై వెళ్లారు. భాద్యతలు స్వీకరించిన శ్యామ్ కు వ్యవసాయ విస్తరణ అధికారులు హన్మంతు, విజయ్ కుమార్, రాజేష్, వైజయంతి లు శుభాకాంక్షలు తెలియజేశారు.


