కాకతీయ, తెలంగాణ బ్యూరో: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా మాట్లాడలేదని, ఎల్లప్పుడూ బీఆర్ఎస్ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఇటీవల తనపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ, స్పీకర్ నోటీస్‌కు ఇప్పటికే సమాధానం ఇచ్చానని తెలిపారు. ఆ సమాధానంలోనే సీఎం కేసీఆర్‌ను కలిసిన విషయాలు, తన అభిప్రాయాలను వివరంగా పొందుపరిచినట్లు వెల్లడించారు.
తాను ఏ పార్టీ కండువా కప్పుకోలేదని, కేసీఆర్‌ను గౌరవించే వారిలో తానే మొదటి వ్యక్తినని కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నేను చేసిన ప్రతి వ్యాఖ్య ప్రజల అభివృద్ధి కోసం మాత్రమే. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాననే ఆరోపణలు తప్పుడు. నా ప్రాధాన్యం గద్వాల అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారం. అభివృద్ధి లేకుండా ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడగడం కుదరదు అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
గద్వాల అభివృద్ధి తనకు ముఖ్యమని, ఆ లక్ష్యంతోనే రాజకీయాలు చేస్తున్నానని స్పష్టం చేసిన కృష్ణమోహన్‌రెడ్డి, పార్టీ రాజకీయాల కంటే ప్రజల మేలు తనకు ముందుందని అన్నారు. కేసీఆర్‌తో ఉన్న అనుబంధం, గౌరవం ఎప్పటికీ కొనసాగుతుందని కూడా పునరుద్ఘాటించారు.
కాగా ఎమ్మెల్యే బండ్ల ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారన్న ప్రచారం బాగా జరిగింది. ఆయన వ్యవహారం కూడా అందుకు బలాన్ని ఇచ్చే విధంగానే సాగింది. అయితే తాజాగా స్పీకర్ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన నోటీసులు ఇవ్వడంతో సీన్ రివర్స్ అయినట్లు తెలుస్తోంది.


